Tuesday, 9 February 2016

తుళ్ళే.... తుళ్ళే ....తుళ్ళే... పాట సాహిత్యం తెలుగులో

చిత్రం: ప్రేమ ఇష్క్ కాదల్
రచన: క్రిష్ణ చైతన్య
గానం:  సాయి చరణ్/ శ్రవణ్
సంగీతం: శ్రవణ్

ఏ మూలో దాగున్నా రాగాలే సాగేలా
ఊపిర్లే ఊదావే గాలుల్లోనే...
ఏ పూలా తీగల్లో మూగావో లాగావో
ఊహల్లో ఊరేగే దారుల్లోనే...
అదోలా మారేలా ఎదా
ఏదోలా తేలేలా...
మదేదో చేరేనా సదా
నీ తోడే కోరే.....
నిన్నే కనీ నా కన్నే అనీ
ఉన్నావనీ నాలోనే
ఇన్నాళ్ళుగా ఈ నేనున్నదీ
నువ్వున్న నేల పైనా..
తుళ్ళే తుళ్ళే తుళ్ళే..........
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే........
తుళ్ళే తుళ్ళే తుళ్ళే
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే.....

ఎగసే మనసే మురిసే వరసే
ౠతువులు మరచేలా
పలికే వరమే.... అలకే చెలిమై...
వదలక వలచేనా...........
నీ జన్మకే నా జన్మే జతే
ఉంటాను నే నీలోనే.......
నీ నీడకే నేనో జాడగా
వెంటడనా కాలాన్నే......
తుళ్ళే తుళ్ళే తుళ్ళే..........
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే........
తుళ్ళే తుళ్ళే తుళ్ళే
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే........

తలచే తలపే వరమై గెలిచే సమయము ఏపుడమ్మ
అడుగొ మలుపై బ్రతుకే మెరిసే ఏదకిక వెలుగేనా...
ఈ బొమ్మకే పొయేలా మతే, అంటాను ఈ పదాన్నే 
ఉన్నానులే నీలో చాటుగా, మాటవ్వగా మౌనాలే....
తుళ్ళే తుళ్ళే తుళ్ళే..........
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే........
తుళ్ళే తుళ్ళే తుళ్ళే
పిల్లా నీ వల్లే
ఒళ్ళే ఝల్లే గిల్లే........

No comments:

Post a Comment