Monday, 30 June 2014

గోవు - greatness of cow

ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.
అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం

Five stages of grief

The Kübler-Ross model, or the five stages of grief, is a series of emotional stages experienced when faced with impending death or death of someone. 
  • Denial — "I feel fine."; "This can't be happening, not to me."
  • Anger — "Why me? It's not fair!"; "How can this happen to me?"; '"Who is to blame?
  • Bargaining — "I'll do anything for a few more years."; "I will give my life savings if..."
  • Depression — "I'm so sad, why bother with anything?"; "I'm going to die soon so what's the point?"; "I miss my loved one, why go on?"
  • Acceptance — "It's going to be okay."; "I can't fight it, I may as well prepare for it."


వివాహము (Marraiage)

వివాహములు 5 రకాలు:

కులము, శీలము, విధ్యాసంపత్తి కలిగిన వరునికి అధరపూర్వకంగా ఉదక ప్రదానంతో కన్యను అర్పించిన యెడల అది బ్రహ్మము అవుతున్నది. 

కన్యా వరులు ఒకరిమీద ఒకరు అనురాక్తులు అయినప్పుడు జరిపించిన వివాహం క్షాత్రమని అంటారు. 

ప్రగడ అనురాగంతో వలచిన వరునికి కన్యను ఇచ్చి వివాహం జరిపించిన యెడల అది గాంధర్వం అవుతున్నది. 

కన్నియకి ఇంత వెల అని నిర్ణయించి వివాహం జరిపించిన యెడల అది అసుర వివాహం అవుతున్నది. 

తల్లిదండ్రులని ఎదుర్కొని దారుణ క్రౌర్యంతో కన్నియని చేపట్టిన ఎడల అది రాక్షస వివాహం అవుతున్నది. 

మొదటి మూడు శాస్త్ర సమ్మతం. మిగిలిన రెండు ధర్మవిరుద్దం. జననీ జనకులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా ఆ కన్య వివాహానికి అనర్హురాలు. అని ధర్మ వేత్తలు నొక్కి వాక్కానిస్తున్నారు. మహాభారతం.

A wonderful short story :: HOW CAN WE BE HAPPY ?

Once a group of 50 people was attending a seminar.Suddenly the speaker stopped and decided to do a group activity. He started giving each one a balloon. Each one was asked to write his/her name on it using a marker pen. Then all the balloons were collected and put in another room.

Now these delegates were let in that room and asked to find the balloon which had their name written, within 5 minutes. Everyone was frantically searching for their name, colliding with each other, pushing around others and there was utter chaos.

At the end of 5 minutes no one could find their own balloon.Now each one was asked to randomly collect a balloon and give it to the person whose name was written on it.
Within minutes everyone had their own balloon.

The speaker began— exactly this is happening in our lives. Everyone is frantically looking for happiness all around, not knowing where it is.

Our happiness lies in the happiness of other people. Give them their happiness; you will get your own happiness and this is the purpose of human life.

పల్లె కన్న తల్లె

పల్లె కాకికి బోరుకొట్టింది. పట్నం మీదికి మనసు మళ్ళింది. అక్కడ దొరికే మాంసపు ముక్కలూ, స్వీట్ల దుకాణాల బయట పడేసే స్వీటుముక్కలూ, మార్కెట్లలో దొరికే కూరగాయల ముక్కలూ మొదలైన వాటిని గూర్చి ఎప్పుడో విన్న మాటలన్నీ దానికిప్పుడు గుర్తుకు వచ్చి, పట్నమంటే విపరీతమైన మోజుపుట్టింది.

ఆ ఆలోచనరాగానే దానికి పల్లెటూరిమీద ఏవగింపు కలిగింది. ఈ పల్లెలో ఏముందని, ఇక్కడుండాలి? ఇక్కడేమీ లేదు. సుఖమైన జీవితం గడపాలంటే ‘పట్నమే నయం ’ అని తనకు తానే చెప్పుకుని పట్నంవైపుకు ఎగిరింది. పల్లె పొలిమేరలోకి వెళ్ళగానే, దున్నుతున్న రేగడి మడిలో పురుగులను ఏరుకొని తింటున్న కాకుల గుంపు ఒకటి కనిపించింది. ఎలాగూ వెళుతున్నాను కదా, ఓసారి మావాళ్ళని మాట్లాడించి వెళదామనుకొని మడిలో వాలింది. మిగిలిన కాకులన్నీ అది రావటం చూసి కావు కావుమని పిలిచాయి.

అప్పుడు ఈ కాకి అన్నది: "నేను ఇక్కడికి ఊరికే తినడానికి రాలేదు. ఎప్పుడూ ఒకటే తిండి గోల తప్ప, ఇక్కడ ఇంకోటి ఉండదు. అందుకే నేను పట్నం వెళుతున్నాను" అని. అదివిన్న కాకులు దానివైపు అదోలాగ చూశాయి. అప్పుడు ఆ గుంపులోని ముసలి కాకి ఒకటి 'బంగారంలాంటి చోటునొదలి పట్నం వెళ్ళడమేమిటి? నీ అవివేకం కాకపోతే?' అన్నది.

అప్పుడు ఈ కాకి 'ఒసేయ్! ముసలిదానా, నీకేమి తెలుసని నన్ను అవివేకి అంటున్నావే? ఇక్కడేముందని ఉండాలే? ఎప్పుడూ ఈ నేలలోని పురుగులను ఏరుకు తినడం, లేకపోతే ఆ చెట్లపైన వాలి, ఆ పల్లె జనం ఎప్పుడు నాలుగు ముసర మెతుకులు చల్లుతారా అని కాచుకుకూర్చోవడం తప్ప?' అన్నది కోపగించుకుంటూ.

ఆ మాటలకు బదులిస్తున్నట్లు ముసలి కాకి , 'నీకేదో పట్నం మోజు పట్టినట్టుంది. ఇలాంటి ఆలోచనలు మనుషులకే వస్తాయి. 'చేసుకున్నమ్మకు చేసుకున్నంత ' అని, అనుభవిస్తావులే' అన్నది.

ఆ మాటలకు కాకమ్మకు చిర్రెత్తుకొచ్చింది. 'ఏమిటీ! నా మాటలూ, ఆలోచనలూ మనుషుల్లాంటివిగా ఉన్నాయా? 'గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన' అని, నీలాంటి ముసలిదానికేం తెలుస్తుంది, పట్న వాసం గురించి? అయినా నీలాంటి అవివేకికి చెప్పిన నాది బుద్ధి తక్కువ. వస్తానమ్మా తల్లీ!' అని చిర్రుబుర్రులాడుతూ ఎగిరిపోయింది. సాయంత్రానికి పట్నం చేరుకుంది. ఆ రాత్రికది అక్కడే ఎక్కడో పడుకున్నది.

తెల్లవారింది. దగ్గరలోని రైల్వేస్టేషనుకు ఎగిరింది కాకి. అక్కడదానికి బోలెడన్ని కాకులు కనిపించాయి. కానీ అవి పల్లె కాకుల్లా దీన్ని పిలవటం లేదు. దేనికవి వాటి పనులు చేసుకుంటున్నాయి. కాకులే కాదు, బోలెడన్ని పందికొక్కులూ కనిపించాయి. దానికి పట్టరాని సంతోషం కలిగింది. చచ్చి పడిఉన్న పంది కొక్కుల్ని కడుపునిండా తిని, ఇతర ప్రాంతాలను చూద్దామని పట్నంపైకి ఎగిరింది. చాలా తిరిగింది. రైల్వే స్టేషన్లూ, బస్టాండులూ, మార్కెట్లూ, వీధులూ, సందులూ, గొందులూ అన్నీ తిరిగింది. అది వెళ్లిన ప్రతీ చోటా దానికి ఆహారం బాగా లభించేటట్టుంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు బాగానే ఉన్నాయి. వీధులలోని మురికి కాలువలలో ఎలుకలు చాలానే ఉన్నాయి. అబ్బో ఎంత పెద్ద పట్నమో! ఎంతదూరం ఎగిరినా పట్నమే. ఇక్కడ నివసించడానికేం కొదవలేదు' అనుకున్నది కాకి.

ఆ సరికి కొత్త మోజులో కాకి చాలానే తిరిగింది. అయినా అప్పటికి సమయం ఇంకా ఏడు గంటలే. ఇక మొదలయింది వాహనాల హోరు! ఎక్కడ చూసినా జనాలే జనాలు. వాహనాల చప్పుళ్ళు, పొగవాసనలు. ఎక్కడైనా వాలదామంటే జనాలు అడ్డం వస్తున్నారు. ఎక్కడా కాకి వాలేంత చోటుకూడా దొరకటం లేదు. ఆశగా అది చెట్టుకోసం చూసింది. చెట్టుపైన వాలడానికి చాలా దూరమే వెళ్ళాల్సి వచ్చింది. సాయంత్రమయింది, రాత్రయింది. జనాలే జనాలు. అక్కడ కాసేపూ, ఇక్కడ కాసేపూ వాలి దొరికినవేవో తిన్నది. చాలా అలసిపోయి వొళ్లుమరచి నిద్రపోయింది. కానీ కాసేపటికే అది మేలుకోవాల్సి వచ్చింది. అక్కడ కోడిపుంజులు కూసి మనుషులను లేపడానికి బదులు, మనుషులే కోళ్ళను లేపేటట్టున్నారు. ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచేశారో, తెలీటం లేదు. నిద్రపోదామన్నా కాకికి నిద్రరానివ్వటం లేదు అక్కడి శబ్దాలు! తట్టుకోలేక, కాసేపటికి అదీ లేచి రోజువారీ పనిలోకి దూకింది. రోజంతా ఏం చేస్తున్నదో తెలీలేదు, కానీ సమయం మాత్రం గడిచిపోతున్నది!

ఇలా కొంత కాలం గడచింది. కాకికి ఇప్పుడు నిజమైన పట్నం కనిపిస్తోంది. అక్కడ దొరికే ఎలుకలంటే వెగటు పుట్టింది. అవన్నీ ఇప్పుడు కంపుగొడుతున్నట్లు తోస్తున్నాయి. చెత్తబుట్టలు, మురికి గుంటలు వికారం అనిపించ సాగాయి. సరిగ్గా అప్పుడే దానికి జ్వరం వచ్చింది. పల్లెలో అయితే వేపకాయల గుజ్జుతినగానే జ్వరం నయమయేది. అక్కడ దానికి వేపచెట్టు దొరకటమే గగనమయింది. ఆ దుమ్ము, పొగల మధ్య మందు మొక్క ఒక్కటీ కనబడలేదు. 'ఇక ఒక సారి పల్లెకు వెళితే బాగుండును' అనిపించింది కాకికి. మెల్లిగా పల్లెకు ఎగిరిపోయింది. రెండు రోజుల్లో జ్వరం నయమైంది. ఆపైన ఇక కాకికి పట్నం వెళ్ళాలనే ఆలోచనే రాలేదు.