Wednesday, 25 April 2018

  1. వుట్టకెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట.
  2. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు
  3. కంద కు లేని దురద కత్తి పీట కు ఎందుకు
  4. తిండికి ఎద్దు ల లోను దున్నడానికి దుాడ ల లోను వుండే వాడు
  5. క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు.
  6. తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు
  7. ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత
  8. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి 
  9. ఛదస్తపు మొగుడు చెప్తే వినడు గిల్లితే ఎడుస్తాడు
  10. అంత నాడు లేదు ఇంత నాడు లేదు సంత నాడు పెట్టింది ముంతంత కొప్పు.
  11. అమ్మకి అన్నం పెట్టనివడు పిన్నమ్మ కి చీర పెదతాడుట
  12. ఉప్పు లేని భోజనం పప్పు లేని విందు అనట్టు ఉంది మీ ముచ్చట
  13. చెప్పేవి ధర్మ పన్నలు దూరేవి దొమ్మరి గుడిసెలు
  14. గుర్రం గుడ్డిదైనా దణాకి లోటులేదు 
  15. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి 
  16. ఎత్తి ఎత్తి దంచినా ఎగిరి ఎగిరి దంచిన ఒకటే, దంచినమ్మకి బుక్కిందే దక్కుడు
  17. తాదూర సందులేదు మెడకోడోలు
  18. పంక్తిలో చివర కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే చాలు
  19. అడ్డాల్నాడు బిడ్డలు కాని గడ్డాలోచ్చాక బిడ్డలు కాదు.
  20. అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం 
  21. అమ్మ ఆకలి చూస్తుంది ఆలి జేబు చూస్తుంది.
  22. కక్కువచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవు
  23. మింగ లేని వాడు మంగళవారం అన్నాడట
  24. కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు
  25. పానకం పంటికీ...కనకం కంటికీ
  26. కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట
  27. ఆడలేని బోగంది వీది వంకర అనిందిట.
  28. కర్ర వంపు పొయ్య తీరుస్తుంది
  29. వెంకాయమ్మ వడ్డించవమ్మ అంటే వంగలేనమ్మ మంగళవారం అందట
  30. అమ్మబోతే అడవి కొనబొతే కొరివి
  31. లోగుట్టు పెరుమాళ్ళకెరుకా....ఇంటిగుట్టు ఈశ్వరుడికెరుకా
  32. వినే వాడు వుంటె చెప్పే వాడు చెలరేగిపొతాడంట
  33. అత్త సొమ్ము అల్లుడు దానం
  34. జగమెరిగిన బ్రాహ్మడికి జంద్యమేల
  35. చంద్రుడి గుట్టు అమావాస్య కీ ..రాజ్యం గుట్టు ఖజానాకీ
  36. మనసెరిగి మాటా...పాత్ర ఎరిగి దానం
  37. వరద వచ్చి పప్పు తడిసినోడు ఉప్పు తడిసినొడు ఏడ్చారుట. కాని కొబ్బరి బొండాలు తడిసినోడు పొర్లి పొర్లి ఏడ్చాడుట
  38. నీరు పల్లమెరుగు నిజం దేముడెరుగు
  39. తోచి తోచని పెద్దమ్మ తోడికోడలు పుటనింటికి పోయింది...అదీ తోచని అక్కమ్మ ఆడ పడుచు అత్తగారింటికి పోయింది..
  40. చల్లకు వచ్చి ముంత దాచినట్టు
  41. పొద్దున్నే వచ్చిన వాన.... పొదెక్కి వచ్చిన చుట్టాలు తొందరగా పోరు..
  42. కన్ను పొయిన చోటికి కాలు పోకూడదు... కాలు పొయిన చోటికి మనసు పోరాదు...
  43. రేవు దాటే వరకు ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడి మల్లయ్య
  44. మొగుడు ముండ అంటే ముష్టికొచ్చినవాడు కూడ ముండ అంటాడు
  45. లేడికి లేచిందే పరుగు తాతకి తలచిందే పెళ్ళి
  46. పనసకాయ ఉన్నప్పుడే పెద్దల తద్దినం
  47. కూరుపి కూరుపి ఏమిటి నీపని అంటే స్వారూపాలని ఎంచడమే నా పని అందట
  48. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండు అంత సుఖం లేదు
  49. మా తతలు నేతులు తాగారు, మా మూతులు వాసనలు చూడమన్నడట
  50. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదవా?
  51. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు
  52. అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల
  53. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా
  54. చింత చచ్చిన పులుపు చావనట్లు
  55. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు.
  56. అంగట్లో బెల్లాన్ని అయ్యమెళ్ళోలింగానికి నైవేద్యం
  57. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది ట
  58. రామేశ్వరం పొయిన శనేశ్వరం తప్పనట్లు
  59. కాకి ముక్కుకు దొండపండు
  60. ఎక్కిరించ బోయి , వెల్లకిలా పడ్డాడంట.
  61. దూరపు కొండలు నునుపు.
  62. కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు
  63. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
  64. ఎంత చెట్టుకు అంత గాలి
  65. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న
  66. ఎద్దు పుండు కాకికి ఏం నొప్పి
  67. శివుడి ఆఙ్య లేనిదే చీమైన కుట్టదు
  68. దేముడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్లు
  69. ఫులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
  70. కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువ.
  71. కొత్త కోటకు గృహ ప్రవేశం. అత్త గారు అగ్ని హోత్రం.
  72. పెద్దలమాట చద్దన్నం మూట 
  73. ఆరోగ్యమే మహాభాగ్యము 
  74. దున్నపోతే దూడలలోకి మెయ్యపోతే ఎడ్లలోకి
  75. అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
  76. ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగ ఉంటాయి
  77. తమలపాకు తో తానిటలంటే. తలుపుచెక్క తో నేనిటలంటి.
  78. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరుగదు
  79. వృక్షములు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షము
  80. కూటి కోసం కోటి విద్యలు
  81. కొత్తబిచ్చగాడు పొద్దుఎరగడు
  82. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు
  83. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు
  84. గుర్రం లా కుక్కని పెంచి, రెడ్డి తానె మొరిగాడట, దొంగొస్తె
  85. ఏలినవారి బంటు అంటే...ఏటిగట్టునా జాతరలే
  86. కర్ర వంపు పొయ్య తీరుస్తుంది, మనిషి వంకర కాలం తీరుస్తుంది
  87. ఏటిలో చింతపండు పిసికినట్లు
  88. తానుబుక్కతౌడులేదు కాని లంజకుపంచదారా!
  89. పిండికొద్దిరొట్టె
  90. తిండికి సిద్దం పనికి ప్రాలుద్దం
  91. మంది ఎక్కువయితే మజ్జిగ పలచన
  92. మేకవన్నెపులి
  93. విసినికర్రతో నువ్వొకటిస్తే వీసెరాయితో నేనొకటిస్తా.
  94. ఎలుకతోలుబట్టి ఏడాది ఉతికినా కుక్కతోకతో గోదారి ఈదినా
  95. వేడన్నానికి ముందు వేడినీళ్ళకి వెనుక
  96. మాటకు మాట తెగులు, నీటికి నాచు తెగులు
  97. వెధవ మొగుడు పోతే పోయాడు కాని పొన్నచెక్క లాంటి గుండు మిగిలింది
  98. మాంసం తింటున్నామని దుమ్ములు మెడలో వెసుకొలేము కదా
  99. బట్టకి జాడింపు, చారుకి తాలింపు "పెళ్ళానికి లాలింపు" ఎంత ఉంటే అంత బాగుంటాయి
  100. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టా లేడు.
  101. గడ్డివాము దగ్గర కుక్క మాదిరి, అది తినదు, తిననివ్వదు
  102. పండుగనాడూ ..పాత మొగుడే..
  103. శుభం పలకరా మొగుడా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ అన్నాడట
  104. అర్ధరాత్రి అంకమ్మ శవాలు
  105. మొరటోడికి మొగలిపువ్వు ఇవ్వటం
  106. ముసలోళ్ళకి దసరా పండగ
  107. కుక్కకు బొక్కదొరికినట్లు
  108. బ్రాహ్మల్లో చిన్న బెస్తల్లో పెద్ద...
  109. కీలెరిగి వాతపెట్టాలె
  110. పిండి బెల్లం పెట్టి పిన్నమ్మా నీ ప్రసాదము అన్నట్టు
  111. గంగిగోవు పాలు గరిటెడైననుచాలు,కడివెడైననేమి ఖరము పాలు..
  112. ఆకులేని పంట అరవైఆరు పుట్లు...    
  113. ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు    
  114. ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...    
  115. ఆడబోయిన తీర్థమెదురైనట్లు
  116. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు    
  117. ఆడువారి మాటలకు అర్ధాలే వేరు    
  118. ఆడువారు అలిగినా అందమే   
  119. ఆత్రగాడికి బుద్ది మట్టం 
  120. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
  121. ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు    
  122. ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట    
  123. ఆదిలోనే హంసపాదు    
  124. ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు    
  125. ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు    
  126. ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి    
  127. ఆయనే ఉంటే మంగలి ఎందుకు
  128. ఆస్తి మూరెడు ఆశ బారెడు    
  129. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ    
  130. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు    
  131. ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేము    
  132. ఆరోగ్యమే మహాభాగ్యం    
  133. ఆలస్యం అమృతం విషం    
  134. ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె    
  135. ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట    
  136. ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.    
  137. ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం    
  138. ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?    
  139. ఆవు పాతిక బందె ముప్పాతిక    
  140. ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?    
  141. ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు    
  142. ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం    
  143. ఆశ సిగ్గెరుగదు.... ఆకలి రుచి ఎరుగదు    
  144. ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు    
  145. ఆశకు పోతే గోచి ఊడిందట    
  146. ఆస్తి మూరెడు... ఆశ బారెడు
  147. సింగినాథంజీలకర్ర

No comments:

Post a Comment