Wednesday, 14 February 2018

ఎంత సక్కగున్నావే.... పాట సాహిత్యం తెలుగులో , Enta Sekkagunnave lyrics in telugu


చిత్రం: రంగస్థలం
రచన: చంద్రబోస్ 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్


ఏరుసెనగ కొసం మట్టినీ తవ్వితె ఏకంగ తగిలిన లంకెబిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

సింతసెట్టు ఎక్కి సిగురూ కొయ్యబోతే సెతికీ అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

మల్లెపూల మద్దె ముద్దబంతి లాగ ఎంత సక్కగున్నావే 
ముత్తైదువ మెళ్ళొన పసుపూ కొమ్ము లాగ ఎంత సక్కగున్నావే 
చుక్కల సీర కట్టుకున్న ఎన్నెల లాగ ఎంత సక్కగున్నావే ...!
ఏరుసెనగ కొసం మట్టినీ తవ్వితె ఏకంగ తగిలిన లంకెబిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే..!

సింతసెట్టు ఎక్కి సిగురూ కొయ్యబోతే సెతికీ అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే....!

1...
ఓ... రెండు కాళ్ళ సినుకువి నువ్వు 
కొంటె సెర్లొ దూకెసినావు 
అలల మూటలిప్పెసినావు ఎంత సక్కగున్నావే  
లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

మబ్బులేని మెరుపువి నువ్వు
నేల మీద నడిసేసినావు
నన్ను నింగి సేసెసినావు ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

సెరుకు ముక్క నువ్వు కొరికి తింటవుంటె ఎంత సక్కగున్నావే
సెరుకుగడకె తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నావే
తిరునాళ్ళలొ తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వు లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

గాలి పల్లకిలో ఎంకి పాట లాగ
ఎంకి పాటలోన తెలుగు మాట లాగ ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే..!

2....
కడవ నువ్వు నడుమున బెట్టి
కట్ట మీద నడిసొత్తా వుంటే
సంద్రం నీ శంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

కట్టెలమోపు తలకెత్తుకోని
అడుగులోన అడుగెత్త వుంటె
అడవి నీకు గొడుగట్టినట్టు  ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

బురద సేలొ వరి నాట్లు ఏత్తవుంటె ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావే..!
ఏరుసెనగ కొసం మట్టినీ తవ్వితె ఏకంగ తగిలిన లంకెబిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింతసెట్టు ఎక్కి సిగురూ కొయ్యబోతే సెతికీ అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే...!

--ప్రవీణ్ శీలా

No comments:

Post a Comment